Thursday, December 17, 2009

హక్కుల సైరన్

గణితశాస్త్ర అధ్యాపకత్వం
నిర్భాగ్య నిరాశ్రయులకు ప్రశ్నించే హక్కుగా మారిన వైనం
విప్లవోద్యమాల పురితిగడ్డ సహవాసం
అపార తృష్ణతో వ్యాస పరం పరం
మానవ హక్కుల ఉద్యమ శిఖరం
హింసా వ్యతిరేక ఉద్యమ శిబిరం
లాకప్ డెత్ ,ఎన్ కౌం టర్ , ప్రభుత్వ హింస, ప్రైవేటు హింస
హింస ఏ రూపంలో ఉన్నా ప్రతిఘటించాలనే ధ్యాస
తన వ్యాసాల ద్వారా జాగృతం చేస్తిన్న ఘోష
నిరంతరం పౌర హక్కులు మానవ హక్కులకై ప్రయాస
విప్లవోద్యమాల పరినితుల్ని దాష్టికాల్ని తెలిపే నిబ్బరం
నిశ్శబ్ద విప్లవంగా గోల గోపాలం
విప్లచాల చేర్పు గాంధియిస్టు నేర్పు
న్యాయశాస్త్రం,సాహిత్యం , ఆంగ్లంలో దిట్ట
తన కలాన్ని ఝళిపిస్తే పొందగలడు డబ్బులగుట్ట
అతిసామాన్య నిరాడంబర జీవనం
అశేష మేధావిత్వ శేముషీ వైభవం
కేరళ నుంచి మణిపూర్ వరకు
వాకపల్లి నుంచి వాషింగ్టన్ వరకు
జనుల అలజడి హక్కులసుడీ! తానై నిల్చిన ఒరవడి
నిశ్శబ్దంగా కనిపించే అసాధారణ మేధావి
హక్కుల ఉద్యమానికే అంకితమైన బుద్ధిజీవి
గిరిజన హక్కులకు పునర్జన్మ , జి.వొ. 3గా రాలేదామ్మా !
మానవ హక్కులకూ రాజ్యాంగ నిబద్ధతకూ స్పూర్తి
టీతో టీములతో జీవితం
ప్రభుత్వ ధౌష్ట్యాన్ని ఎండగట్టిన సాహసం
హింసోన్మాదాన్ని నిరసించిన సంతకం
మానవత్వం పరిమళించిన జాగృతం
రాళ్ళపల్లి దౌహిత్రుడు
అనంత దీక్షాదక్షుడు
కృష్ణలకై పోరాడాడు
శర్మను త్యజించాడు
అల్సర్ వచ్చినా బేఖాతర్
రస్సెల్ నుండి రస్సెల్ వరకు చల్ చల్
ఆస్పిరిన్ తో అంతమైన హల్ చల్
అభిమానులంతా దిగుల్ తో గుబుల్ గుబుల్
న్యాయ దేవత శోకమూర్తిగా మారింది
పతితుల భ్రష్టుల అండ పోయిందని తల్ల "డిల్లి"ంది
________ ఆకాషిక్ ,1-15 డిషెంబర్ -2009,పేజి నెం. 43

No comments:

Post a Comment