Thursday, July 28, 2011

సత్య శోధన శతకము

సత్య శోధన శతకము
ఈ శతకం లో అనేక శాస్త్ర విజ్ఞాన విషయాల గురించి ,శాస్త్రజ్ఞుల గురించి ఆటవెలది పద్యాల్లో వివరించారు డా// కాసర్ల రంగారావు గారు.

ఈ శతకాన్ని " శాస్త్ర విజ్ఞానాన్ని సంస్క్రతి తో మేళవించి మానవ నాగరికతను ఉచ్ఛ: స్థితికి తీసుకుపోయిన మహా మహులందరికీ " అంకితమిస్తున్నానని రాసారు .

శాస్త్రపరిశోధనల్లో శిఖరాయమానం గా వెలిగిన కొంతమంది శాస్త్రవేత్తల గురించి ,వారు సాధించిన విజయాల గురించీ ఈ శతకం ద్వారా తెలుసుకోవచ్చు.

ప్రతులకు: రచయిత,ఇ-33,కె.టి.పి.పి. కాలనీ, కె.టి.పి.పి. చెల్పూర్, ఘణపురం(ములుగు) మండలం, వరంగల్లు జిల్లా, 506168

(సాహితీ కౌముది జులై 2011,పేజి నెం. 35)

Saturday, July 2, 2011

భాషాంజలి

నా భాషాంజలి ఇక్కడ ఫోల్డర్ రూపం లో వుంది