Friday, August 20, 2010

నేల---నరులు

హరితావరణ ప్రకృతి మానవ పరిణామ ఆవిష్కృతి
జనజీవనంలో ఎన్నో ఆటు పోట్లు
సమావసరాలకై సిగపట్లు
సామూహిక జీవనం నేర్పింది వేట
మానవ పరిణామ శాస్త్రా నికే బాట
ఏర్పరచుకున్న గుర్తులే క్రమంగా శబ్దాలు
శబ్దాల క్రమబద్దీకరణే లిపుల ఆనవాళ్ళు
గుహ జీవితం నుండి నదీతీరాలకు వలస
మచ్చిక జంతువులతో కులాసా
వ్యవసాయం వృత్తి విభజనతో గ్రామజీవితం
అతలాకుతలమైన జీవనయాత్రలు
వలసజీవితాలతో వెతికే మార్గాలు
కూడు గుడ్డ గుడిసెలకై ఆరాటం
పాలించే రాజుల్నే అడిగితే పాపమా!
వాగ్దానాల్ని గుర్తుచేస్తే నేరమా !
తూటాల వర్షానికి గాంధీ నిశ్చేష్టత
సహనమూర్తి అంబేద్కర్ కు ఘాత
త్యాగం రేపటి యింధనం
సమూహ ఉద్యమమే బలం
జాతిపిత నేర్పిన పాఠం లుకలుకలు కానున్న ఉక్కుపాదం
అన్యాయం సహించలేని నేతాజి,శివాజీలు .
పరిస్తితుల్ని మధింపు వేస్తున్న యువకిశోరాలు
భూ మాఫియా చేతిలోవసుంధర
హిరణ్యాక్ష ఆగడాలకు జనజీవితం చిందర వందర
కృత్రిమ మార్కెట్ తో పనికిరాని "భూ ం" లన్నీ హాం ఫట్
గూడుకై ఆరాట పడితే గుండెల్లో తూటాలు
"ఎరుపు" రేపటి సూర్యోదయానికి ఆనవాళ్ళు .
(చిత్ర,జూన్ 2010 ; పేజి నెం: 103)

నేల---నరులు

హరితావరణ ప్రకృతి మానవ పరిణామ ఆవిష్కృతి
జనజీవనంలో ఎన్నో ఆటు పోట్లు
సమావసరాలకై సిగపట్లు
సామూహిక జీవనం నేర్పింది వేట
మానవ పరిణామ శాస్త్రా నికే బాట
ఏర్పరచుకున్న గుర్తులే క్రమంగా శబ్దాలు
శబ్దాల క్రమబద్దీకరణే లిపుల ఆనవాళ్ళు
గుహ జీవితం నుండి నదీతీరాలకు వలస
మచ్చిక జంతువులతో కులాసా
వ్యవసాయం వృత్తి విభజనతో గ్రామజీవితం
అతలాకుతలమైన జీవనయాత్రలు
వలసజీవితాలతో వెతికే మార్గాలు
కూడు గుడ్డ గుడిసెలకై ఆరాటం
పాలించే రాజుల్నే అడిగితే పాపమా!
వాగ్దానాల్ని గుర్తుచేస్తే నేరమా !
తూటాల వర్షానికి గాంధీ నిశ్చేష్టత
సహనమూర్తి అంబేద్కర్ కు ఘాత
త్యాగం రేపటి యింధనం
సమూహ ఉద్యమమే బలం
జాతిపిత నేర్పిన పాఠం లుకలుకలు కానున్న ఉక్కుపాదం
అన్యాయం సహించలేని నేతాజి,శివాజీలు .
పరిస్తితుల్ని మధింపు వేస్తున్న యువకిశోరాలు
భూ మాఫియా చేతిలోవసుంధర
హిరణ్యాక్ష ఆగడాలకు జనజీవితం చిందర వందర
కృత్రిమ మార్కెట్ తో పనికిరాని "భూ ం" లన్నీ హాం ఫట్
గూడుకై ఆరాట పడితే గుండెల్లో తూటాలు
"ఎరుపు" రేపటి సూర్యోదయానికి ఆనవాళ్ళు .
(చిత్ర,జూన్ 2010 ; పేజి నెం: 103)

నేల---నరులు

హరితావరణ ప్రకృతి మానవ పరిణామ ఆవిష్కృతి
జనజీవనంలో ఎన్నో ఆటు పోట్లు
సమావసరాలకై సిగపట్లు
సామూహిక జీవనం నేర్పింది వేట
మానవ పరిణామ శాస్త్రా నికే బాట
ఏర్పరచుకున్న గుర్తులే క్రమంగా శబ్దాలు
శబ్దాల క్రమబద్దీకరణే లిపుల ఆనవాళ్ళు
గుహ జీవితం నుండి నదీతీరాలకు వలస
మచ్చిక జంతువులతో కులాసా
వ్యవసాయం వృత్తి విభజనతో గ్రామజీవితం
అతలాకుతలమైన జీవనయాత్రలు
వలసజీవితాలతో వెతికే మార్గాలు
కూడు గుడ్డ గుడిసెలకై ఆరాటం
పాలించే రాజుల్నే అడిగితే పాపమా!
వాగ్దానాల్ని గుర్తుచేస్తే నేరమా !
తూటాల వర్షానికి గాంధీ నిశ్చేష్టత
సహనమూర్తి అంబేద్కర్ కు ఘాత
త్యాగం రేపటి యింధనం
సమూహ ఉద్యమమే బలం
జాతిపిత నేర్పిన పాఠం లుకలుకలు కానున్న ఉక్కుపాదం
అన్యాయం సహించలేని నేతాజి,శివాజీలు .
పరిస్తితుల్ని మధింపు వేస్తున్న యువకిశోరాలు
భూ మాఫియా చేతిలోవసుంధర
హిరణ్యాక్ష ఆగడాలకు జనజీవితం చిందర వందర
కృత్రిమ మార్కెట్ తో పనికిరాని "భూ ం" లన్నీ హాం ఫట్
గూడుకై ఆరాట పడితే గుండెల్లో తూటాలు
"ఎరుపు" రేపటి సూర్యోదయానికి ఆనవాళ్ళు .
(చిత్ర,జూన్ 2010 ; పేజి నెం: 103)

Thursday, March 4, 2010

మాతృభాష-మహత్తు(ఆకాశిక్,16-28ఫిబ్రవరి-2010, పేజి నేం. 44)

దేబ్బతాకిన దు:ఖము తీవ్ర మవగ
తన్నుకొని వచ్చునాంధ్రము తపన తెలుప
తనదు భాషలో తన్నుతా కనగ వచ్చు
ఎడద చీల్చుకో ! వచ్చునా ఎరువు భాష
కూర్మి తోడ నిలిపె కొమఱ్ఱాజు విఙ్ఞాణ
సర్వములను తాను పర్వములుగ
దేష భాష లందు తెలుగు దీప్తి
తెలుసుకొనుము నీవు తేజరిల్ల
ఙాన భాండలన్ని జారవిడుచుకొని
అన్యభూమి కేగి అచట నీవు
కోలుపోయినదియె పోల్చగలవు
ఉన్నదాని విలువ ఉత్తదగున
జాషువ కవి సుకవి పాశుపతము వంటి
అభ్యుదయపథము అతని రీతి
పద్యమెత్తి చీల్చె పాశవికతనంత
మంచి కొరకు అతడు మార్గమాయె
నిందమో పుట యెంతయొ నేరమగును
నిజము యేంతనో నిజముగా నిగ్గుతేల
భాద్యతలనన్ని మరచుట పాదికాదు
తెలుగు కొరకైన అందర్లొ తెగువచూపు

Sunday, February 28, 2010

మాతృభాష-- మహత్తు (ఆకాషిక్ ,16-28,ఫిబ్రవరి - 2010 ,పేజి 44)

మాతృభాష యందు మాస్టరీ యున్నచో
సాధ్య పడును నీకు శాస్త్రమెల్ల
ఇతర చదువులెల్ల నింపుగా వచ్చును
మాతృభాష యొక్క మహిమ చూడు
భాషజీవనాడి భావము లన్నిట
భాష బతికియున్న ఘోషతప్పు
తెలుగు కొరకు మనకు తీవ్ర ఉద్వేగంబు
తల్లిభాష తీపి తలచుకొనగ
జాగృత దేషమా పలుకు చక్కటి తీయని స్వంత భాషయే
జాగృతి కోసమే సలిపె శాంతియుతంబగు స్వావలంబనే
జాగృత మానసంబులివి జాతికి మేలగు పాఠముల్ కవీ
జాగృత పద్యముల్ పలుకు జాతిని నిద్రను మేలుకొమ్మనన్
లుకలుక మాని అందరు తెలుంగుకు సైయన భాష మోగదో
పకపకవద్దు భాషను శభాషన నందరుదార చేర్చిరో
చకచక భావి కాలము సుసాధ్యము గాను పమించు జెంటుయే
బెకబెకలాడు భాషలు సపిండగు మాతృసదాశయార్తితో

బొబ్బిలి దెబ్బకున్ మిగులు పీనుగ రీతిగ మాతృభాషయే
దబ్బున నిద్రనుండిలను ధాటిగ లేచిన అన్యకూతలున్
మబ్బున సూర్యునే నిలుప మాయున తేజము తేటగాకనే
కబ్బము కాదె యందరకు కాంతుల వెల్గిన తె ంగుభాషయే

Sunday, February 14, 2010

సత్యశోధన (ప్రసారిక ఫిబ్రవరి 2010, పేజి నెం.12)

తలదు ఒళ్ళు నొప్పి తాళలేకుందురు
బెణుకు నొప్పు లెన్నొ పీడగాను
అమృత అంజనమున అంతులేనీ హాయి
సత్యశోధనకిల సాటికలదె


వంగి కృంగి చితికి వడలిపోవుట కాదు
చింత తోడ నీవు చితికి పోకు
వ్యధలు అన్ని తొలగు వ్యాయామముల తోడ
సత్యశోధనకిల సాటికలదె


కోరి చదివినాడు కోదండ రాముదు
విద్య విలువ లెల్ల విశద పరచ
యింటి కంపు వాని యిత్తడి చేసెను
సత్యశోధనకిల సాటికలదె


తెలివితేటలందు ధీటైన మొనగాడు
లౌ క్య ప్రజ్ఙ లేక లోకమందు
కాకులన్నిపొడువ కనలె కోకిలరీతి
సత్యశోధనకిల సాటికలదె

సత్యశోధన (ప్రసారిక డిసెంబర్ 2009, పేజి నెం.6 )

ముంపు జనులనెల్ల మోసపుచ్చొద్దని
చట్ట బద్ధ తల్ని సరిగ నేర్పి
మేలుకొనగజేసె మేధ పాటకరేగ
సత్యశోధన కిల సాటి కలదె

విశ్వ మంత తిరుగ వైజ్ఙాన పర్వంబు
శాస్త్ర జ్ఙాన తృష్ణ సలలితముగ
అమెరికాకు కూర్చె అత్యంత అమరిక
సత్యశోధన కిల సాటి కలదె

మొసలి పాములు తన మితృలే నన్నాడు
కౄర జంతువనిన కోపమేమి !?
చేపముల్లు గుండె చీల్చె ఇర్విను నేమి !?
సత్యశోధన కిల సాటి కలదె

జనక జన్యు రాగ సస్వరమాలిక
రాగ రంజితంబు రసమయంబు
బాల మురళి కృష్ణ బాగుచేయుట చూడు
సత్యశోధన కిల సాటి కలదె
ప్రజల కష్టములను సుజల ధారలు తీర్చు
నీరు లేక బతుకు దార్లు లేవు
నాగరీకమంత నారాయణము కదా
సత్యశోధన కిల సాటి కలదె