Sunday, February 14, 2010

సత్యశోధన (ప్రసారిక ఫిబ్రవరి 2010, పేజి నెం.12)

తలదు ఒళ్ళు నొప్పి తాళలేకుందురు
బెణుకు నొప్పు లెన్నొ పీడగాను
అమృత అంజనమున అంతులేనీ హాయి
సత్యశోధనకిల సాటికలదె


వంగి కృంగి చితికి వడలిపోవుట కాదు
చింత తోడ నీవు చితికి పోకు
వ్యధలు అన్ని తొలగు వ్యాయామముల తోడ
సత్యశోధనకిల సాటికలదె


కోరి చదివినాడు కోదండ రాముదు
విద్య విలువ లెల్ల విశద పరచ
యింటి కంపు వాని యిత్తడి చేసెను
సత్యశోధనకిల సాటికలదె


తెలివితేటలందు ధీటైన మొనగాడు
లౌ క్య ప్రజ్ఙ లేక లోకమందు
కాకులన్నిపొడువ కనలె కోకిలరీతి
సత్యశోధనకిల సాటికలదె

No comments:

Post a Comment