Thursday, December 17, 2009

హక్కుల సైరన్

గణితశాస్త్ర అధ్యాపకత్వం
నిర్భాగ్య నిరాశ్రయులకు ప్రశ్నించే హక్కుగా మారిన వైనం
విప్లవోద్యమాల పురితిగడ్డ సహవాసం
అపార తృష్ణతో వ్యాస పరం పరం
మానవ హక్కుల ఉద్యమ శిఖరం
హింసా వ్యతిరేక ఉద్యమ శిబిరం
లాకప్ డెత్ ,ఎన్ కౌం టర్ , ప్రభుత్వ హింస, ప్రైవేటు హింస
హింస ఏ రూపంలో ఉన్నా ప్రతిఘటించాలనే ధ్యాస
తన వ్యాసాల ద్వారా జాగృతం చేస్తిన్న ఘోష
నిరంతరం పౌర హక్కులు మానవ హక్కులకై ప్రయాస
విప్లవోద్యమాల పరినితుల్ని దాష్టికాల్ని తెలిపే నిబ్బరం
నిశ్శబ్ద విప్లవంగా గోల గోపాలం
విప్లచాల చేర్పు గాంధియిస్టు నేర్పు
న్యాయశాస్త్రం,సాహిత్యం , ఆంగ్లంలో దిట్ట
తన కలాన్ని ఝళిపిస్తే పొందగలడు డబ్బులగుట్ట
అతిసామాన్య నిరాడంబర జీవనం
అశేష మేధావిత్వ శేముషీ వైభవం
కేరళ నుంచి మణిపూర్ వరకు
వాకపల్లి నుంచి వాషింగ్టన్ వరకు
జనుల అలజడి హక్కులసుడీ! తానై నిల్చిన ఒరవడి
నిశ్శబ్దంగా కనిపించే అసాధారణ మేధావి
హక్కుల ఉద్యమానికే అంకితమైన బుద్ధిజీవి
గిరిజన హక్కులకు పునర్జన్మ , జి.వొ. 3గా రాలేదామ్మా !
మానవ హక్కులకూ రాజ్యాంగ నిబద్ధతకూ స్పూర్తి
టీతో టీములతో జీవితం
ప్రభుత్వ ధౌష్ట్యాన్ని ఎండగట్టిన సాహసం
హింసోన్మాదాన్ని నిరసించిన సంతకం
మానవత్వం పరిమళించిన జాగృతం
రాళ్ళపల్లి దౌహిత్రుడు
అనంత దీక్షాదక్షుడు
కృష్ణలకై పోరాడాడు
శర్మను త్యజించాడు
అల్సర్ వచ్చినా బేఖాతర్
రస్సెల్ నుండి రస్సెల్ వరకు చల్ చల్
ఆస్పిరిన్ తో అంతమైన హల్ చల్
అభిమానులంతా దిగుల్ తో గుబుల్ గుబుల్
న్యాయ దేవత శోకమూర్తిగా మారింది
పతితుల భ్రష్టుల అండ పోయిందని తల్ల "డిల్లి"ంది
________ ఆకాషిక్ ,1-15 డిషెంబర్ -2009,పేజి నెం. 43

Monday, December 7, 2009

వాస్తవం

తెలంగాణా ఉద్యమం గురించి ఇటీవలి సంఘటనలు మనసును బాగా కలచి వేస్తున్నాయి. జకీయులకు ఇది ఒక పాచికలా మారింది. ఇది చాలాచాలా తప్పు .ఇందిరాగాంధి ఇలాగే పంజా తో గెలికి ప్రాణమ్మీదికి తెచ్చుఒకుమది. అమాయకులను,మంచివారిని రెచ్చగ్నొట్టవద్దు . దానివల్ల విపరీఇత పరిణామాలు వస్తాయి. తెలంగాణా గురించి నేను వ్రాసిన కవిత యిక్కడ ఇస్తున్నాను.
నా తెలంగాణ కోటి రతనాల వీణ
నా తెలంగాణ శతకోటి వజ్రాలకోన
నా తెలంగాణ ప్రస్తుతం భీభత్స భయోజ్వల ధుని

నాతెలంగాణ తడుస్తుంది తుపాకిగుళ్ళ భీభత్స వడగళ్ళ వాన
తరతరాల మోసం ,కాపట్యం కౌటిల్యం
ఫ్యూఢల్ తత్వపు ఊడల మర్రిల వ్యక్తిత్వం
కులమతాల కుళ్ళిపోయిన వారసత్వపు రాజకీయం
వికటించిన,పెచ్చరిల్లిన హింసా విధ్వంసపు దౌర్జన్యకర ప్రతిఘటనం
విఙ్ఞాన శాస్త్రపు విలువయిన ప్రయోగ ఫలితాలు
కావాలి జనజీవనానికి స్వావలంబన ఆలంబనస్తంభాలు
సోషలిజం పేరున జరిగిన అరాచక అనుత్పాదక పోకడలు
వ్యక్తిప్రాతిపదికా సామాజికప్రగతిప్రాతిపదికా ప్రణాళికలతో రావాలి మార్పుల చేర్పులు
సబ్సిడీ,కమీషన్ ల కాంట్రాక్టుల భాగోతం
కాల్చి,పేల్చి,కూల్చే ప్రగతి రథం
మిన్నంటిన పరుగు ధరలు
మన్నంటిన నరుల కలలు
( మీ సంఘమిత్ర నందు ఈ వారం కవితగా 28-10-2000 ---- 3-11-2000 సంచికలో ప్రచురితమైంది )

Tuesday, December 1, 2009

సన్మానం నవంబర్ 2009

ఒంగోలులో విశ్వశాంతి వారు శ్రీమతి కమలపాటి శాంత లక్ష్మి గారి అధ్వర్యంలో ,29 నవంబర్ నాడు ఇందిరా గాంధి పై పద్యకవితా సంకలనం మరియు కవిసమ్మేళనం జరిగింది. అనంతరం కవులకు సన్మానం కూడా చేసారు .అందులో నేనుకూడా ఉన్నాను. దానికి సంబంధించి విషయాలు వివరాలు త్వరలో ఇక్కడ ఉంచగలను