Monday, December 7, 2009

వాస్తవం

తెలంగాణా ఉద్యమం గురించి ఇటీవలి సంఘటనలు మనసును బాగా కలచి వేస్తున్నాయి. జకీయులకు ఇది ఒక పాచికలా మారింది. ఇది చాలాచాలా తప్పు .ఇందిరాగాంధి ఇలాగే పంజా తో గెలికి ప్రాణమ్మీదికి తెచ్చుఒకుమది. అమాయకులను,మంచివారిని రెచ్చగ్నొట్టవద్దు . దానివల్ల విపరీఇత పరిణామాలు వస్తాయి. తెలంగాణా గురించి నేను వ్రాసిన కవిత యిక్కడ ఇస్తున్నాను.
నా తెలంగాణ కోటి రతనాల వీణ
నా తెలంగాణ శతకోటి వజ్రాలకోన
నా తెలంగాణ ప్రస్తుతం భీభత్స భయోజ్వల ధుని

నాతెలంగాణ తడుస్తుంది తుపాకిగుళ్ళ భీభత్స వడగళ్ళ వాన
తరతరాల మోసం ,కాపట్యం కౌటిల్యం
ఫ్యూఢల్ తత్వపు ఊడల మర్రిల వ్యక్తిత్వం
కులమతాల కుళ్ళిపోయిన వారసత్వపు రాజకీయం
వికటించిన,పెచ్చరిల్లిన హింసా విధ్వంసపు దౌర్జన్యకర ప్రతిఘటనం
విఙ్ఞాన శాస్త్రపు విలువయిన ప్రయోగ ఫలితాలు
కావాలి జనజీవనానికి స్వావలంబన ఆలంబనస్తంభాలు
సోషలిజం పేరున జరిగిన అరాచక అనుత్పాదక పోకడలు
వ్యక్తిప్రాతిపదికా సామాజికప్రగతిప్రాతిపదికా ప్రణాళికలతో రావాలి మార్పుల చేర్పులు
సబ్సిడీ,కమీషన్ ల కాంట్రాక్టుల భాగోతం
కాల్చి,పేల్చి,కూల్చే ప్రగతి రథం
మిన్నంటిన పరుగు ధరలు
మన్నంటిన నరుల కలలు
( మీ సంఘమిత్ర నందు ఈ వారం కవితగా 28-10-2000 ---- 3-11-2000 సంచికలో ప్రచురితమైంది )

No comments:

Post a Comment