Thursday, March 4, 2010

మాతృభాష-మహత్తు(ఆకాశిక్,16-28ఫిబ్రవరి-2010, పేజి నేం. 44)

దేబ్బతాకిన దు:ఖము తీవ్ర మవగ
తన్నుకొని వచ్చునాంధ్రము తపన తెలుప
తనదు భాషలో తన్నుతా కనగ వచ్చు
ఎడద చీల్చుకో ! వచ్చునా ఎరువు భాష
కూర్మి తోడ నిలిపె కొమఱ్ఱాజు విఙ్ఞాణ
సర్వములను తాను పర్వములుగ
దేష భాష లందు తెలుగు దీప్తి
తెలుసుకొనుము నీవు తేజరిల్ల
ఙాన భాండలన్ని జారవిడుచుకొని
అన్యభూమి కేగి అచట నీవు
కోలుపోయినదియె పోల్చగలవు
ఉన్నదాని విలువ ఉత్తదగున
జాషువ కవి సుకవి పాశుపతము వంటి
అభ్యుదయపథము అతని రీతి
పద్యమెత్తి చీల్చె పాశవికతనంత
మంచి కొరకు అతడు మార్గమాయె
నిందమో పుట యెంతయొ నేరమగును
నిజము యేంతనో నిజముగా నిగ్గుతేల
భాద్యతలనన్ని మరచుట పాదికాదు
తెలుగు కొరకైన అందర్లొ తెగువచూపు