Tuesday, October 27, 2009

నా విన్నపం

నా సాహిత్యం అభిప్రాయాలు మీ ముందుకు తెస్తున్నాను.
పరిశీలించి తగు సూచనలు సలహాలు ఇవ్వగలరు.

Saturday, October 24, 2009

మొండిదైర్యం(భగీరథం)

రెడ్డికాంగ్రెస్ లో యం యల్ ఏ
ఇందిరాతీర్ఠం హైహైలే
అంజ య్య ద్వారా ఎక్సైజు,విద్య
చెన్నాకు అసమ్మతి చురక
పాతబస్తీ అల్లర్లతో మెలిక
కాంగ్రెస్ కులపర్వతాలతోఢీ
పాచికలతో అసెంబ్లీకి నో ఎంట్రీ

అధిష్టానం చేతిలో అసమ్మతి అస్త్రం


చెన్నా జెన్నాకోట్లకు తూట్లు


కాంగ్రెస్ పరాజయం సంపూర్ణం

అసెంబ్లీ పిసిసిలతో తెలుగుదేశంకు పొగ

పిజెఆర్ వైయస్సార్లు చంద్రబాబుకు సెగ

అధిష్టానం సంపూర్ణ సహకారం

పాదయాత్రతో జన సమ్మోహనం

సామాజిక అసంతృప్తితో సమ్మేళనం

మిత్ర పక్షాలుగా బలసమీకరణం

తొమ్మిదేళ్ళ సైకిల్ పాలనకు పంక్చ

ర్రెండు ట్యూబులూ ఫెయిల్యూర్ (ఇంకావూంది)

జాగ్రత్తగా తెలంగాణావాదం తొక్కివేత

టి.ఆర్.యస్. ఎం.ఏ.ల చీల్చివేత

కె.సి.ఆర్ కు గుండెకోత

ముంతపొగబెట్టి బయటకు లాగి చంపినవైనం

బుష్ ఎందులో ఫెయిల్యూరో వై.యస్ . అందులో విజయం

ఫించన్ ,ఆరోగ్యశ్రీ , పావలా వడ్డీ తాయిలాలతో జన నీరాజనం

ఇందిరమ్మ ఇళ్ళ తో జనహృదయ నేతగా ఆవిర్భావం

సీనియర్ల వారసుల కిక్కడ కుర్చీ అక్కడ చితిపేర్చి

సెజ్ లతో జలయజ్ఞ కాంట్రాక్టులతో అస్మదీయులకు బలం కూర్చి

తస్మదీయులను వేటాడి వెంటాడి కూల్చి పేల్చి

మిత్రపక్షాలనన్నింటినీ తొక్కి తొక్కి పేల్చి పేల్చి చీల్చి

ఒకే ఒక్క రాష్ట్ర కాంగ్రెస్ దురంధరుడుగా ఆవిర్భావం

వరుణుడు మా పార్టీలో ఉన్నాడనే ధీమా

షష్టి పూర్తితోబోనస్ గా జీవితమనే సరంజామా

మృత్యువు పిలుపై వచ్చిన హెలికాప్టర్ ప్రయాణo

రచ్చబండకై రాలిన చిరునవ్వు

పులివెందుల "పులి" అర్ధాంతరంగా బలి

అభిమానులు స్నేహితులు వల వల

రాష్ట్రమంతా విలవిల

అందరికి నమస్కారం

సాహిత్యం మీ ఇల్లలొ దీపమై వెలగాలని అకాంక్షతో
-రంగారావు