Sunday, November 22, 2009

కారణం

ఈ మధ్యలో బద్దకం అనాసక్తివల్ల బ్లాగులో ఏదీ రాయట్లేదు. మిత్రుల హెచ్చరిక వల్ల ఏదో గిలుకుతున్నా. కానీ కానీ బ్ళాగిస్తూవుండు అన్న వాళ్ళ మాటలే ఈ రాతలకు కారణం మళ్ళీ ఊపొస్తే మరికొన్ని

Monday, November 16, 2009

నోబెల్ 2009 ఆటవెలదుల్లో

రామకృష్ణ నంటె రాటు తేలినవాడు
రైబొజోము గుట్టు రట్టు చేయ
ఓషధాల కొరకు అంది వచ్చినదది
సత్యశోధనకిల సాటికలదె
స్టీట్జు యోన్ హ తోడ స్వేదము చిందగ
రామకృష్ణ నెరిగె రైబొసోము
నిర్మితముల నిగ్గు నిలబెట్టి తెలిపిరి
సత్యశోధనకిల సాటికలదె

ఓర్మితోడ నెగ్గె ఒబామా గమనించు
చర్చ లేవదీసి చరుపు చరిచె
ఆవు రావురు మనె అమెరికామనముల
శుద్ధిచేయ చిత్తశుద్ధి చూపె

ఎలిజ బెత్ కరోలు ఎంపిక స్జొస్టాకు
క్రోమొజోము రక్ష క్రోడిచేయ
టెలిమరేజు చేత ఠీక టిప్పణిడిరి
సత్యశోధనకిల సాటికలదె

ఖావొ కృషియె సిసిడి కండక్టరవగానె
బాయ్ లు మరియు స్మిత్లె బలపరచగ
డిజిటలాయె కాంతి టెక్నికలుగవెల్గ
సత్యశోధనకిల సాటికలదె


హక్కులన్ని పోయి అలమటించు వార్నే
క్షోభపోవ తాను క్రోధ మనక
అంతరాత్మతోడ అడిగె ముల్లరెహెర్త్ గా
నోబులు బహుమతిన నుతులు పొంద

Friday, November 13, 2009

సంభాషణ

ఇప్పటివరకు నేను ఈ బ్లాగులో ఉంచిన కవితలను చదివి మీ మీ అభిప్రాయములు తెలుపగలరు.

Wednesday, November 11, 2009

చివరి హెచ్చరిక

ఆసియావాసులు మించిపోతున్నారు కళ్ళు తెరవండి
స్ఫర్ధతో పోటీపడాల్సిన రంగంలో విద్వేషం నిరుద్యోగం
కళ్ళముందే కళకళ లాడే జీవితాల్ని చూసి కళ్ళమంట
అక్కసు చేతకానితనం తమదే పైచేయని పెరిగిన అహంకారం
విచ్చలవిడితనంతో సంస్కృతి హీనమైన జాత్యహంకారం
నిజాల కొలిమిలో భస్మమై పోతుంటే జాత్యహంకారవిషం
చదువులకై పనికై ఆహ్వానించి అభాసుపాల్జేయటం
లావాలా విషం వెళ్ళగక్కటం
చంకలు కొట్టుకునే పరమ పవిత్రత
బ్యాంకుల దివాలాగా మారిన చరిత్ర
ఆర్థిక జూదం మాంద్యం కోరల్లో విలవిల
"నాం " చిట్టి ఆయీ హై
మంచివారిని శ్రమజీవుల్ని మొట్టే పరిహాసం
తాము దోచినజాతి తమకన్నా బాగా బతకటమా
స్వరాజ్ పాల్ ,మిట్టాల్ ,ఐటి దిగ్గజాల్
ఆసియావాసులే ఆక్రమిస్తూ పోతే
పశ్చిమ బెడదగా ఈ రాక్షసం
మందీమార్బలమూ ఉండి కట్టడి చేయలేని చాతకానితనం
పృఆణాలకు విలువలేని కోట్లాది జీవులనే అలుసుతనం
ఖబర్దార్
రెపరెపలాడే త్రివర్ణ పతాక
భరతీయం శాంతిసౌభ్రాతృత్వాల వేదిక
హద్దుదాటారో
మీ దుర్మార్గాల దుస్చేష్టలకు అశని పాతక
ఇడే చివరి హెచ్చరిక

Saturday, November 7, 2009

ఇందిర__ప్రియదర్శిని!!?

సీ" తాతమ్మ పేరును తండ్రికిష్టము గాను
ప్రియదర్శివైతివి ప్రేమమీర
వర్ణాంతర వివాహ వైనముంజూపిన
అంతరాత్మకు నీవు అంజలిడిన
చేదోడు వాదోడు సేవలు చేసావు
జనకుని కొరకునై జంకకీవు
సంజయ రాజీవు సరసన నిలిచిరి
తల్లికొరకు వారు తల్ల "ఢిల్లి"
ఆ" అంతులేని బాధ అవినీతి చేకూర్చ
జేపి పెంచి నాడు బీపి నీకు
అత్యవసరస్థితిని ఆశలుడగ జేసి
పుంజుకొంటి వీవె పోరు బాట
ఆ" సిండికేటును తను చీల్చి చెండాడినా
పేదరికము పోవ పిలుపునిచ్చె
బలిమి కలిమి కూర్చ బలమైన ఉద్యమం
బంగ్ల దేశ గాను పరిణమించె
సీ " రాజభరణముల రద్దుతో సమభావం
బ్యాంకు జాతీయాల ఫణము యెక్క
ద్రవ్య నియోగమే దండిగానయ్యేను
పేదల చేతిలో పైకమాడ
ఆసియా ఆటల ఆర్థికమే హెచ్చె
జనుల కొనరు కూర్చె జమిలి గాను
తరతమ బేధము తరిగిపోవాలనే
తపన నెరిగి జనం తలపులోన
ఆ" అమ్మ చేతి గుర్తు అభయహస్తమ్మని
నమ్మికొలిచినారు నాటినుండి
జనుల నమ్మకమును జలధిన ముంచక
అమలు చేయమనిరి ఆర్తితోడ

ఉ" ఇందిర శక్తియుక్తులతొనెందరి నోడగ చేసెనోకదా
అందినదెల్ల వాడిమొన యానగ శత్రువు నెల్లరును మహా
రౌద్రిమరీతి నణిచిన రోషము మీరగ నిక్సనే యిలన్
సందిట చేకొని నడిపి జాతికి దీప్తిని కూర్చితీవెగా
ఆ" వాజపేయి చేత వరదుర్గ వైతివి
కిచిడి వంటి పేర్న ఖిన్నపడిరి
జనత పార్టి చీల్చి జయమునోదగజేస్న
కాంగ్రెసు పథమందు క్రాంతదర్శి


సీ" అంతరిక్షమునందు ఆనంద మొందగ
పరిశోధనలతోటి ప్రస్ఫుటముగ
ఉపగ్రహాలను పంపి ఓహోయనునట్లూ
శాస్త్ర సాంకేతిక సఫల ఫలము
ప్రజలకంకితమయ్యె పరువు నిలపగాను
హరిత విప్లవములు అంది వచ్చె
నిరసనోద్యమములు నేర్పుగా నెగడులై
అకాలీ బాసట అనలమయ్యె

ఆ" రాజకీయ రగడ రాజుకొన్నను జూడ
భింద్రవాలెగాను పీతముడిగ
బలినిగొంది తుదకు భస్మాసురహస్తం
కాంచవలెను భావి హెచ్చరికగ

ఆ" రాజహంస ఠీవి రాజీవు గాంధీది
ఆధునిక సరళిగ అడుగువేయ
భారతీయులంత పారవశ్యము చేత
స్వాగతించినారు సరసహృదయు

ఆ" కొడుకు లిర్వు నీవు కోల్పోవ జూడగా
బాధచెందు మదిలు పరివిధాలు
ప్రజల పార్టి నేడు పంగబాసెను చూడు
స్వార్థ చింతనకిది శాపమయ్యె

ఆ" శాసనాల పాల సంకీర్ణ ప్రభుతలు
నిర్ణయాల కొరకు నీల్గుడాయె
నాయకత్వలేమి వ్యయముగా కనపట్టు
శక్తి స్థల్ గ నీవు చక్కబెట్టు

Friday, November 6, 2009

విరోధి---ఉగాది

విరోధినామ సంవత్సరమా స్వాగతం
మావిరోధాలన్నీ నీలో ఇముడ్చుకొని
మాకు విరోధాలు లేకుండా చేసి
సుఖశాంతులు భద్రత కలిగించు
కొత్త ఉగాది రుచులతో
ఆంల దాడులు లేని కత్తిపోట్లూ కానరాని
సువిశాల త్యాగపూరిత ప్రేమల ఆనందవనం
వికసింపజేసే కార్యక్రమంతో ముందడుగు వేయాలి మనం
అలసి సొలసిన యుద్ధ వాతావరణంలో
ఆర్థిక మాంధ్య గాలిమేడల కూలుడులో
నల్లనయ్యల వేణుగానం ఊరటనివ్వాలి
ఈ సువిశాల ప్రపంచంలో ఉండేచోటుకై
కడుపుకింత బువ్వకై ఆరాటపడే వ్వ్లకోట్ల జీవుల
ఆవేదనను ,కాలమా ఆదుకో !
నీ యీ ప్రయాణవేదిక ప్రజావేదికగా చేసుకో !
ప్రజాస్వామ్యమును ప్రజాస్పందనగా మలచి
మంచికొరకు ఆరాటపడే పోరుసలిపేజీవుల
వేదనకు త్యాగాలకు రూపునివ్వాలని మాకోరిక
ప్రతిఒక్కరికి పనికి సేద తీరుటకు కావాలి తీరిక
ప్రకృతి మాకు మంచి మార్పు నివ్వాలని ఈ వేడుక
సదానీకూడలితో మా ఆనందకర మార్పుకై కావాలి ఈ కూడలి ఒక వాడుక

Tuesday, November 3, 2009

తెలుగువాడు

కాళోజీ వారసుడా! కవితాతత్వ లాలసుడా
తెలుగు 'వాడి ' కి ఒరవు నీవు!తెలుగువాడినోర్వలేవు!
శ్రీశ్రీ కి ఛాయ వాడు ! చాయ్ లేనిదుండలేడు
సాఫ్ట్ వేర్ కింగ్ వాడు! చల్ల కదలకుండలేడు
కృష్ణశాస్త్రి చలం గార్ల మిర్రి మిర్రి చూస్తాడు
జాషువాను జాగ్రత్తగ నెత్తికెత్తుకుంటాడు
కందుకూరి కలలపంట కౌలుకిచ్చుకుంటాడు
గురుజాడ గురుపీఠం ఇంకొకరికి వదలలేడు
బాపిరాజుకెల్లప్పుడు బాసటగా నిలుస్తాడు
త్యాగయ్యను వీడలేడు తంబూరా మీటుతాడు
వేమన్న వెన్నంటిన వాడు వేయిప గలుగా సాగినాడు చూడు
రామదాసు కలిమి బలిమి రాగద్వేషాలకు కనలె కొలిమి
పోతన్నకు పంట వాడు తంటలేక ఉండలేడు
శ్రీనాధుని ఇంటివాడు సిరికందము తెచ్చువాడు
గంజాయిని సాగుచేయ గంపేడాశ చూపుతాడు
గండాలను దాటాలని గుండాలను మేపూతాడు
గాదె కింద పందికొక్కు కానకుండ ఒదులుతాడు
గోదావరి పరుగులోన గోదాములు నింపుతాడు
కృష్ణమ్మ ఉరుకులోనె కడుపు నింపు కష్టజీవి
నైజామును గద్దె దించె జమీందార్ల పనిపట్టె
అవశేషం మిగిలిందిక అవకాశం రావాలిక
గరికపాటి రాజారావు ఘనాపాటి గణనీయుడు
ప్రజాకళల ప్రజావళికి బాధ్యుడైన వైద్యుడు
శంకలేక స్పందించిన అంత:రంగ సూత్రుడు
వాస్తులోని వాస్తవమ్ము వాచిపోయి వాంతికొచ్చె
విషయంత్రము వీగిపోయి వెలుగుబాట ముందుకొచ్చె
ఖద్దరునొక ఊపుఊపి గద్దర్ గా కదలినాడు
ఖుద్దుగ తనకెందూ కుదురులేక నిలిచినాడు
ఖద్దరు నొక ఊపు ఊపి గద్దర్ గా కదిలినాడు
ఖుద్దుగ తనకెందూ కుదురులేక నిలిచినాడు
వాయిదాల పద్దతిపై అప్పులలో మునుగుతాడు
అప్పుమీద వడ్డీకై అప్పులనే తెస్తాడు
అప్పును తప్పనకుండా ముప్పులలో ఇరుకుతాడు
అప్పుచేసి పప్పుకూడు అందరికీ పెడతాడు
తెలివిలోన తేటజూపి కింగ్ మేకరౌతాడు
కొర్టులెంట తిరిగి తిరిగి కోతలెన్నో కోస్తాడు
వ్యాజ్యానికి రాజ్యానికి పొత్తు కుదరదంటాడు
గుడ్ బైలకు గుడ్ గై లకు ఘొల్లు ఘొల్లు మంటాడు
తెలంగాణ ఘల్లుమంటే ఝల్లు ఝల్లు మంటాడు
కలహాలకు సలహాలకు కరువులేదు అతనికి
యింటి గుట్టు చెప్పకుంటె నిద్రపట్టదతనికి
తెలుగువాన్ని సాచికొట్టు తెలివితేటలతనికి
పుట్టుకతో అబ్బినాయి ఎందుకోయి తనిఖి?
నలుగురితో నారాయణ అనలేడోయ్ అనలేడు
పేరుగొప్ప ఊరుదిబ్బ పెత్తనాలు చేస్తాడు
ఇంటిలోన పోరుపెట్టి ఇల్లెక్కి అరుస్తాడు
గల్లిలోనతానుండి ఢిల్లీకై కలగంటడు
గోతులుతీస్తూ తానే గోవిందుడనంటాడు
పీవిని రాజుచేసి పీకులాట పడతాడు
గోచిపెట్టుడొదలడు గోసపుచ్చుకుంటడు
గోత్రాలు లేనివాడు గోసాయిల కలవడు
అమెరికాయె ఆంధ్రయైన నాడు
తెలుగుభోజుడింటింటికి చూడు
విశ్వనాధు వీడలేడు విశ్వవీణ మోస్తాడు
శృంగారము మెచ్చుతాడు సింగారిగ మార్చుతాడు
కూచిపూడి కుర్రదాన్ని కూడబలుక్కుంటాడు
మధురవాణి గెలుచువాడు మారాజుగా కులుకుతాడు
మీనాక్షిని జలజాక్షిని మచ్చుకైన వదలడు
శృంగారమె కిర్రెక్కి కంగారై పోతాడు
లుబ్దావధాన్లకెపుడూ లబ్దికై నిలుస్తాడు
రామప్పంతులు ఇంట్లో రాట్నాలు వడుకుతాడు
గిరీశాన్ని మించినట్టి గింగిరీలు కొడతాడు
వరము వంటి ఘంటసాల ఒరవడినిట జూపినాడు
చాలు చాలు అనేవరకు బాలులా పాడతాడు
బాపు బొమ్మ గీస్తాడు పాపయ్యకు సాటి ఎవడు ?
సమరం వీడింటి వైద్యుడు గోరానిక జవదాటడు
కవిరాజును కౌగిలించ యింత 'తాపీ' నీకెందుకంట
శరత్ వాడి యింటల్లుడు దేవదాసే తోడల్లుడు
ప్రణాళికలు వేసి వేసి టక్కున దిగజారుతాడు
కరి మ్రింగిన వెలగపండు మాదిరిగా మారుతాడు
బిక్క మొహం వేస్తాడు బితుకు బితుకు మంటాడు
మొల్లనైన సరే సరే గిల్లకుండ వదలడు
దళితవాద ఉద్యమంతో దుమ్మురేగగొడతాడు
బహుజనులతొ సమ్మెక్కై బాహుబలం చూపుతాడు
మైనార్టీ కవిత్వంతో మతులే పోగొట్టుతాడు
మహబ్బతే: నడిపి నడిపి మహానగరు కట్టినాడు
గణపతి,పార్వతీశం, రేలంగిల కనుసన్నల నడిపి నడిపి
కనకధార, హాస్యరసం బేకబిగిన కురిపినాడు
టెక్నాలజి వాడి చెలిమ ,మేక్షగుండం పూడిపోదు
కరుణరసం వాడి చలువ , కాఠిన్యం చూపలేడు

నాగార్జునుడై జగతికి తత్వబోధ చేశాడు
మల్లినాధ సూరిగా వ్యాకరణం నేర్పాడు
వీరత్వం చూపినాడు కాకతీయనేలినాడు
రుద్రమాంబ కరవాలం భద్రంగా దాచినాడు
యుగంధరుని యుద్ధరీతి బ్రహ్మనాయుని సంఘనీతి
ఆకళింపు చేసుకొని కాలుదువ్వు శత్రువుల కాటికి పంపించినాడు
వెంకన్నకు గుండుకొట్ట అన్న మయ్య నెగేస్తాడు
అసమ్మతిని రాజేసి అందలాల నెక్కుతాడు
నన్నయ్యకు అన్నయ్యగ నాటకాలనాడతాడు
తిక్కన్నకు లేని తిక్క అంటగట్టి తీరతాడు
పెన్నానది పరవశంతో పెరుగన్నం వండినోడు
ప్రేగు మోత పెట్టగానే వలసదాసుడయ్యిండు
రాయలసీమ అయ్యయ్యో వలస సీమ అయ్యిందో!
నకనకలాడే కడుపుల కరువుల కాక హెచ్చిందో
పుట్టపర్తి ఇకలేడు ! వేమన్నా కనరాడు
వెంకన్నకు తిక్కెక్కువ అమెరికాకు పోతడేమొ
వెర్రివాడు రాముడొక్కడె ! ఎక్కడికీ పోడు
ప్రతి గుండెలో కొలువుంటడు వాల్మీకికి కాపుంటడు
భధ్రకాళి , దుర్గాంబ పైడితల్లి సమ్మక్క ఎల్లమ్మల మైసమ్మల
ఎల్లవేళ కొలుస్తాడు ఏకత్వం చూపుతాడు
దూబగుంట ఎల్లమ్మ గూబగుయ్యిమనిపిస్తే
గుబగుబలు పోయిండు గుద్దులు తన్నులు తిన్నడు
నమ్మకంగ ఏమార్చె ఇల్లంతా వరద కూర్చె
శ్రీహరికే కోటగట్టె ఆకాశాని కెగరబట్టె
యింట గెలిచి రచ్చగెలుపు సూత్రమ్మిట చెల్లదంట
పొరుగోడే పొగిడినాక మనవాడేనని చూడాలిక రొమ్ము విరుపు
కొరతవేసి కట్టుగట్టి చరిచి ఒక్క చరుపు
అడుగుతాడు చూపమని నీశక్తిని లేకుండా వెరపు
గోడు గోడు నేడ్చెటోడే తెలుగోడని తెలుసు
వెరపు లేక దూరతాడు అతి దగ్గరి మలుపు-

Monday, November 2, 2009

వియోగం

కలికి తళుకుల సొగసు
ఆరబెట్టకు వయసు
కలతచెందదె మనసు
పరువాల మైమరచు
తరిగిపోయెను నాదేహ కాంతి
తొలగుచున్నది విషయ 'వాంఛా భ్రాంతి
స్మృతియందు నీవె విస్మృతిలోనీవె
నీమాయ నామీద నిలువునా సోకె
అర్థంబు విడిచితి వ్యర్థంబు తిరిగితి
దేవదాసును కాను జావకారి పోను
పరవసించగా నీవు చేసే ఈ 'ఉపకారం'
ప్రేమికులకొనగూర్చు చక్కని 'సహకారం'
సల్లాపం ఎల్లప్పుడూ అందంగా ముగియదు
ప్రణయ మాధుర్య రేఖల వెలిగే భావనా ప్రయత్న మాగదు

అమృత ఫలం

నడిచే సబర్మతీఆశ్రమం
పెద్దరోగ పీడితులకు ఆశ్రయం
అభయసాధకనే సం క్షోభపరిచే జిజ్ఙాస
కనువిప్పుతో జలజల రాలిన కన్నీళ్ళ ఘోష
చనిపోతున్న శుష్కించినవానికి ఆఖరిసంస్కారం
అహం గర్వం అంతా మంటల్లో దగ్ధం
అబాగ్యులకు పేదవారికి సదా అండ
కుటుంబమంతా కుష్ఠు నిర్మూలనకై కైదండ
సమస్యతో మమేకమయ్యే దృక్పథం
వ్యాధి క్రిముల్ని పెంచే క్షేత్రం గా తన శరీరం
ఏ మహాత్ముడూ యిం త వరకు చేయని సాహసం
బహిష్కృతులకు తానే ఆనందవనం
ఏ రాజకీయ ప్రాపకానికి వెంపర్లాడక పోవడం
ప్రత్యామ్నాయ అవార్డులతోనే ప్రపంవ నీరాజనం
బాబా అంటూ నివాళులర్పించిన జాతి
ఆత్మౌన్నత్యానికై ఆ ంటే చూపిన బాటే ఖ్యాతి
మహాత్ముడే నివ్వెరపోయే స్ఫూర్తి
ఇరవయ్యవ శతాబ్దం రగిలించిన సేవాభావ ప్రవృత్తి
కీర్తి శిఖరాలకై వెంపర్లాడని ఆత్మ సంతృప్తి
అభాగ్యులకు వెలుగులందించిన మార్గదీప్తి