Saturday, November 7, 2009

ఇందిర__ప్రియదర్శిని!!?

సీ" తాతమ్మ పేరును తండ్రికిష్టము గాను
ప్రియదర్శివైతివి ప్రేమమీర
వర్ణాంతర వివాహ వైనముంజూపిన
అంతరాత్మకు నీవు అంజలిడిన
చేదోడు వాదోడు సేవలు చేసావు
జనకుని కొరకునై జంకకీవు
సంజయ రాజీవు సరసన నిలిచిరి
తల్లికొరకు వారు తల్ల "ఢిల్లి"
ఆ" అంతులేని బాధ అవినీతి చేకూర్చ
జేపి పెంచి నాడు బీపి నీకు
అత్యవసరస్థితిని ఆశలుడగ జేసి
పుంజుకొంటి వీవె పోరు బాట
ఆ" సిండికేటును తను చీల్చి చెండాడినా
పేదరికము పోవ పిలుపునిచ్చె
బలిమి కలిమి కూర్చ బలమైన ఉద్యమం
బంగ్ల దేశ గాను పరిణమించె
సీ " రాజభరణముల రద్దుతో సమభావం
బ్యాంకు జాతీయాల ఫణము యెక్క
ద్రవ్య నియోగమే దండిగానయ్యేను
పేదల చేతిలో పైకమాడ
ఆసియా ఆటల ఆర్థికమే హెచ్చె
జనుల కొనరు కూర్చె జమిలి గాను
తరతమ బేధము తరిగిపోవాలనే
తపన నెరిగి జనం తలపులోన
ఆ" అమ్మ చేతి గుర్తు అభయహస్తమ్మని
నమ్మికొలిచినారు నాటినుండి
జనుల నమ్మకమును జలధిన ముంచక
అమలు చేయమనిరి ఆర్తితోడ

ఉ" ఇందిర శక్తియుక్తులతొనెందరి నోడగ చేసెనోకదా
అందినదెల్ల వాడిమొన యానగ శత్రువు నెల్లరును మహా
రౌద్రిమరీతి నణిచిన రోషము మీరగ నిక్సనే యిలన్
సందిట చేకొని నడిపి జాతికి దీప్తిని కూర్చితీవెగా
ఆ" వాజపేయి చేత వరదుర్గ వైతివి
కిచిడి వంటి పేర్న ఖిన్నపడిరి
జనత పార్టి చీల్చి జయమునోదగజేస్న
కాంగ్రెసు పథమందు క్రాంతదర్శి


సీ" అంతరిక్షమునందు ఆనంద మొందగ
పరిశోధనలతోటి ప్రస్ఫుటముగ
ఉపగ్రహాలను పంపి ఓహోయనునట్లూ
శాస్త్ర సాంకేతిక సఫల ఫలము
ప్రజలకంకితమయ్యె పరువు నిలపగాను
హరిత విప్లవములు అంది వచ్చె
నిరసనోద్యమములు నేర్పుగా నెగడులై
అకాలీ బాసట అనలమయ్యె

ఆ" రాజకీయ రగడ రాజుకొన్నను జూడ
భింద్రవాలెగాను పీతముడిగ
బలినిగొంది తుదకు భస్మాసురహస్తం
కాంచవలెను భావి హెచ్చరికగ

ఆ" రాజహంస ఠీవి రాజీవు గాంధీది
ఆధునిక సరళిగ అడుగువేయ
భారతీయులంత పారవశ్యము చేత
స్వాగతించినారు సరసహృదయు

ఆ" కొడుకు లిర్వు నీవు కోల్పోవ జూడగా
బాధచెందు మదిలు పరివిధాలు
ప్రజల పార్టి నేడు పంగబాసెను చూడు
స్వార్థ చింతనకిది శాపమయ్యె

ఆ" శాసనాల పాల సంకీర్ణ ప్రభుతలు
నిర్ణయాల కొరకు నీల్గుడాయె
నాయకత్వలేమి వ్యయముగా కనపట్టు
శక్తి స్థల్ గ నీవు చక్కబెట్టు

No comments:

Post a Comment