Friday, August 22, 2014

Saturday, February 18, 2012

జైత్రయాత్రలో మరో మజిలీ 17-2-2012

కర్కపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో నేడు శ్రీ డా// కాసర్ల రంగారావు గారి సత్యశోధన శతక పఠన మరియు వివరణ కార్యక్రమం జరిగింది. 7థ్ ,6థ్ ,5థ్ పిల్లలు పద్యాలు చదువగా రచయిత వాటిని వివరించారు . ఈ కార్యక్రమం శ్రి పమిడి సతీష్ రెడ్డి గారి అధ్వర్యంలో జరిగింది

Sunday, January 29, 2012

జైత్రయాత్రలో ఇంకో మజిలీ 23-1-2012

23-1-2012 నాడు పరకాల అరవింద స్కూలులో స త్య శోధన శతకము పై సభ జరిగింది. రచయిత శ్రీ కాసర్ల రం గారావు ,పల్లేరు వీరాస్వామి,శ్రిధరాచార్యులు, సుధాకర్ , సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు . విధ్యార్థులతో పద్యాలు పాడిం చి రచయిత వాటిని వివరిం చారు. ఏ వార్త 24-1-2012 నాటి అన్ని దినపత్రికలలో వచ్చింది .

Friday, August 26, 2011

malkapuram high school

మల్కపురం హైస్కూల్ నందు 24-8-11 నాడు రచయిత సత్యశోధన విషదీకరణ ప్రతుల పంపిణీ జరిగింది. ఉప ప్రధానాచార్యులు శ్రీ బిక్షపతి గారు తమ శ్రావ్య పద్య పఠనంతో అందరినీ ముగ్ధుల్ని చేశారు. ఉపాధ్యాయులు ,విధ్యార్థులు సహకరించారు.

Sunday, August 21, 2011

జైత్రయాత్ర--1


సత్య శోధన శతకము 20 ప్రతులు & రచయిత ఉపన్యాసము 20-8-2011 నాడు స్తానిక చెల్పూర్ ప్రభుత్వ పాఠశాలలో 11గం. నుండి 12 గం. వరకు జరిగింది. రచయిత వివరణలతో కూడిన విశ్లేషణకు ప్రధానోపాధ్యాయుడు మరియు స్టాఫ్ రచయితను అభినందించారు. శతకమును అర్థము చేసుకొని రచయిత ఆశయాన్ని నెరవేర్చాలని పిల్లలకు ఉద్భోధించారు . సుమారు 100 మంది 8,9,10 తరగతుల పిల్లలు హాజరయ్యారు.

Tuesday, August 16, 2011

వ్యక్తిత్వం


వ్యక్తిత్వం మలచుకో

అది దేదీప్యమానమై నిన్ను నిలబెడుతుంది

ఒంటి స్థంభం మేడ మీది గాజుదీపంలా

సుదూరతీరాల బాటసారులకు

కల్లోల తరంగాల్లో తల్లఢిల్లుతున్న నావలకు

సంచార గ్రహాలకు గమ్యస్థానమై

దిశానిర్దేషం చేస్తుంది

ఒక బాపూ , ఒక కేసరి ఇంతటితో సరి

అవకుండా తరతరాలు వేలిగే సిరి

అల్లూరి , బోసయ్యలు

అయినారిట దిక్సూచిలు

ఆచరణే ప్రామాణికం

సంఘజీవితానికదిముఖ్యం

కాలపుపెట్టెలోని ప్రాణం

గడువు తీరిపోయినా గమిస్తుంది లక్ష్యం ( 2007 లో వ్రాయబడింది )

Wednesday, August 10, 2011

ముద్ర

(రచనా కాలం 18-10-2008)
ప్రకటనల ఆధునికతకై తహ తహ
రిలయన్స్ రస్నాల బాసట
విమల్ తో వినూత్న విజయం .
ఒడిదుడికులు జయాపజయాలు
మిట్టపల్లాలు. గుణపాఠాలు
కఠోర దీక్షతో అంతర్మధనం
అంతర్ముఖంతో సవరణలు
సమిష్టి నాయకత్వమే
విజయాల పరంపరల వెల్లువ
ముద్ర మైకాలుగా పంటకాలువ
ఎజికె గా రచనల పరం పర
నిజాయితీగా లోపాల సవరణ బిరబిర
ఎంతటిస్తాయికెదిగినా మూలాలు మరవని వాడవుర
కష్టాల కడలిని దాటిన ధీరుడౌర
జేజేలతో జనాల నోటవచ్చె ఔరౌర