Tuesday, August 9, 2011

ధీరుడు

పెద్ద దిక్కు లేనివాడు పేదరికం బరువు వాడు
చదువు సంధ్య రాని వాడు షెల్ లో బంధీగా గడిపినాడు
వ్యాపారపు మెళుకువలను ఆకళింపు చేసుకొన్న చిన్నవాడు
పాలియెస్టర్ ప్రత్యేకత ప్రతిభతో వీక్షించెను
పట్టుబట్టి ప్రభుతతో దిగుమతులే నిషేధించెను
దేషంలో వస్త్ర పరిశ్రమకు తానే దిక్కై ప్రకాశించెను
త్రిలక్షల సామాన్యుల కోటీశ్వరుల మార్చ బాట జూపెను
ప్రత్యర్థులు గర్జించిరి పతనానికి వలపన్నిరి
వి.పి.తో కూడికయి వాడవాడ పొగబెట్టిరి
కోర్టుల్లో యిరికించి గోల్ మాల్ చేయజూస్రి
పక్షవాత గడబిడతో పడగొట్టే పట్టుబట్టిరి

పుంజుకొనెను విశ్వాసం పూనుకొనెను సామర్థ్యం
రిలయెన్సును ఎగరేసెను కప్పులతో క్లిప్పులతో
పెట్రోల్ పంపులోని కుర్రవాడు పెట్రో ఇండస్ట్రీగా ఎదిగినాడు
భారత పరిశ్రమ రంగానికి సూర్యునిగా మార్చినాడు
విజ్ఙ్తతో ముందుచూపుతో వారసులను తీర్చిదిద్దె
రిలయెన్సంటేనే నిజంగా ఆధారమని నిలబెట్టె
అంబా- నీ ఒడిలో విశ్రాంతిగ కన్నుమూసె
భరతమాత్ అశ్రుకణం పాతాళాగంగను చేరె

No comments:

Post a Comment