Sunday, August 7, 2011

అవగాహన---- ఆవాహన

బతుకమ్మ దీవెనలు
బతుకంతా సాగాలి
బతికి బతికించే
సంస్కృతినే నిలపాలి

దుర్మార్గపు దోపిడీల
కోటరీలు కూల్చాలి
అందరిలో ఆనందం
అనంతంగ తొణకాలి
సమ్మక్క సారక్కలు
అస్థిత్వపు వేగుచుక్కలు
కాళోజీ దాశరథులు
పోరాటపు ధృవతారలు
అందెశ్రీ గద్దర్ లు
పోరాతపు తెరచాపలు
అలుపెరుగక పాడినారు
అధిరిపాటు ఓర్చినారు
జయరాజే జయగీతం
జనజీవన ఆరాటం
గోరేటి బాలకిషన్
జనం కొరకు పరేషాన్
దేశపతి జూలూరి
అహర్నిషలు పలవరించి
కలవరించి కళవరించి
ఎత్తిరదిగొబేజారై
శ్యాంబెనగళ్ శంకర్ లూ
బతుకులోని వంకర్లూ
తెరపైనే చూపెట్టిరి
తొవ్వ కోసం తొడ గొట్టిరి
జయశంకర్ కోదండరాం
ఐక్య పోరాట వేదికలు
తెలంగాణ సారమంత
అస్థిత్వపు పోరుమంట
తెలంగాణ తీరుచూడిరి
తెలివితోటి మసులుకోండ్రి
(జూలై ,2011 లో వ్రాసింది )

1 comment:

  1. telangana poraata malaya manjha maarytham.........
    kaaraadhu swaartha parula chethilo keelu bomma waatam........
    ravi kaanchani choota kavi kaanchun........
    kasarla kavitvam shikaraagraana niluchun........

    ReplyDelete